హైదరాబాద్ : ముషీరాబాద్ భోలక్పూర్లో శనివారం (ఆగస్టు 19న) అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్ బాక్స్ పేలడంతో అగ్ని ప్రమాదం జరిగింది. భోలక్పూర్ అంజుమన్ స్కూల్ సమీపంలో ఉన్న స్టీల్ స్క్రాప్ దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది. దుకాణంలో పని చేస్తున్న గౌసిద్దీన్ అనే వ్యక్తి.. కెమికల్ బాక్స్ కట్ చేస్తుండగా ఉన్నట్టుండి పేలుడు సంభవించింది. దీంతో గౌసిద్దీన్ శరీరం పూర్తిగా కాలిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.
విషయం తెలియగానే పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, స్థానికుల సహాయంతో గౌసిద్దీన్ ను చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

