ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్ కు వాన పడే అవకాశం

ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్ కు వాన పడే అవకాశం

అడిలైడ్ (ఆస్ట్రేలియా): ఈ రోజు ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగబోయే రెండవ టీ20 సెమీ ఫైనల్ కి 20 శాతం వర్షం పడే సూచనలు ఉన్నాయని అడిలైడ్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు అక్కడి వాతావరణం మామూలుగానే ఉన్నా, మ్యాచ్ మొదలయ్యే సమయానికి వర్షం పడే చాన్స్ ఉందని చెప్తుంది. 

ఈ రోజు కొన్ని గంటలే వర్షం పడి మ్యాచ్ జరిగే అవకాశం ఉంటే, ఎంపైర్లు మ్యాచ్ ను 5 ఓవర్లకు కుదించి మ్యాచ్ జరిపిస్తారు. ఒకవేళ ఇవ్వాల పూర్తిగా వర్షం పడి మ్యా్చ్ రద్దయితే, శుక్రవారం (నవంబర్ 11)ను రిజర్వ్ డేగా ప్రకటించి, ఆ రోజు మ్యాచ్ ఆడిస్తారు. రేపు (శుక్రవారం) కూడా వర్షం పడి మ్యాచ్ ఆడించలేకపోతే, ఎక్కువ మ్యాచ్ లు గెలిచి గ్రూప్ టాప్ ప్లేస్ లో ఉన్న టీం ఇండియా నేరుగా ఫైనల్ కి వెళ్తుంది.