
మనదేశంలో కల్తీ చేసే ఆహారపదార్థాల్లో మొదటి ప్లేస్లో ఉండేది పాలు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాలు టెస్ట్ చేస్తే అందులో నీళ్లు, డిటర్జెంట్, కొవ్వు, యూరియా వంటివి కలుపుతున్నట్టు ఒక స్టడీలో తేలింది. వీటితోపాటు సుద్ద, కాస్టిక్ సోడా వంటివి కూడా కలుపుతున్నారట. మార్కెట్లో కల్తీ పాల తయారీతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు.
లేటెస్ట్ గా నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద కల్తీ పాల కేంద్రాన్ని భువనగిరి ఎస్ వోటీ పోలీసులు గుర్తించారు. పక్కా సమచారంతో పాల ఉత్పత్తి దారుడు కండ్లకట్ట మలారెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు..అతడి నుంచి 60 లీటర్ల కల్తీ పాలు, 500ml హైడ్రోజన్ పేరాక్సైడ్, 4 కిలోల స్కిమ్మద్ మిల్క్ పౌడర్ ను సీజ్ చేశారు పోలీసులు.