
- రాజ్యసభలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసేందు కు కనీస వయసును 25 నుంచి 21 ఏండ్లకు తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. గురువారం ఆయన రాజ్య సభలో మాట్లాడారు. మన దేశంలో యువత ఎక్కువగా ఉంది. 35 ఏండ్ల కంటే తక్కువ ఏజ్ ఉన్న జనా భా 65 శాతంగా ఉంది. 25 ఏండ్ల లోపువారు 50 శాతం మంది ఉన్నా రు. మనది వయసు మళ్లిన నేతల తో కూడిన యువ దేశం. ఇది యువ రాజకీయ నేతలతో కూడిన దేశంగా మారాలి అని అన్నారు.