ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం.. కప్పేసిన పొగమంచు

ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం.. కప్పేసిన పొగమంచు

 

ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ  పూర్ కేటగిరీలోనే కంటిన్యూ అవుతోంది. ఢిల్లీలోని కీలకప్రాంతాలు దట్టమైన పొగమంచు, ఎయిర్ పొల్యూషన్ తో ఇంకా చీకటినే తలపిస్తున్నాయి. ఆనంద్ విహార్ లో ఎయిర్ క్వాలిటీ సూచి 388 ఉండగా  అశోక్ విహార్ లో 386, లోధి రోడ్ లో 349గా రికార్డు అయింది. అటు  జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో AQI 366 కింద సూచిస్తోంది. రాజధానిలోని ఎయిమ్స్, రెడ్ పోర్ట్ , సిగ్నేచర్ బ్రిడ్జ్, నెహ్రూపార్క్, జామామసీదు, ఇండియా గేట్, పంజాబీబాగ్, కరోల్ బాగ్, పార్లమెంట్ ఏరియాలో ఎయిర్ పొల్యూషన్ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. 

అటు మితిమీరిన వాయు కాలుష్యంతో మార్నింగ్ వాకింగ్ లో ఇబ్బందులున్నాయని స్థానికులు చెబుతున్నారు.అటు పొల్యూషన్ అధికంగా ఏరియాలో యాంటీ స్మోగ్ గన్ లతో రోడ్లపై నీటిని చల్లుతూ..కాలుష్యాన్నితగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.