కొత్త మున్సిపాలిటీగా ములుగు

కొత్త మున్సిపాలిటీగా ములుగు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : మున్సిపాలి టీల్లోనూ అవిశ్వాస కాలపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మున్సిపల్‌‌‌‌ చట్టానికి సవరణలు చేస్తూ సోమవారం సభలో బిల్లు ప్రవేశపెట్టింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీగా ఉన్న ములుగు జిల్లా కేంద్రాన్ని కొత్త మున్సిపాలిటీగా ప్రతిపాదించింది. మున్సిపల్‌‌‌‌ చైర్‌‌‌‌ పర్సన్‌‌‌‌, వైస్‌‌‌‌ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌పై సభ్యులు అవిశ్వాసం పెట్టే కాలపరిమితి ప్రస్తుతం 3 ఏండ్లు ఉండగా, దాన్ని 4  ఏండ్లకు పెంచనున్నారు. క్యాతన్‌‌‌‌పల్లి మున్సిపాలిటీ పేరును రామకృష్ణా పూర్‌‌‌‌ మున్సిపాలిటీగా మార్చారు. ఈ సవరణ బిల్లుకు అసెంబ్లీ, కౌన్సిల్‌‌‌‌ మంగళవారం ఆమోదం తెలుపనున్నాయి.