చెన్నైకి యాదాద్రి సప్త గోపుర కలశాలు

చెన్నైకి యాదాద్రి సప్త గోపుర కలశాలు
  • బంగారు తాపడం చేయించేందుకు పంపిన అధికారులు

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ సప్తగోపురాలపై ఏర్పాటు చేసే కలశాలు, ప్రధానాలయంలో ఏర్పాటు చేసే ధ్వజస్తంభం తొడుగులకు బంగారు తాపడం చేయించేందుకు చెన్నైకి పంపారు. యాదాద్రి నూతన ఆలయ పునర్నిర్మాణ పనులలో భాగంగా సప్తగోపురాలపై ప్రతిష్ఠించే కలశాలను పూర్తిగా రాగితో తయారు చేశారు. ఇలా తయారుచేసిన 56 కలశాలను రెండు సప్తతల గోపురాలు, ఐదు పంచతల గోపురాల పైభాగంలో ప్రతిష్ఠించనున్నట్లు వీటిని తయారు చేసిన రవీంద్రన్ తెలిపారు. అదేవిధంగా స్వయం భూ ఆలయ మధ్య భాగంలో నిర్మించే ధ్వజస్తంభం రాగి తొడుగుకు మెరుగులు దిద్దారు. వీటికి బంగారు తాపడం జరిగిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్ఠించనున్నట్లు అధికారులు తెలిపారు. కలశాల తయారీ కేంద్రాన్ని శనివారం యాదాద్రి ఆలయ ఈవో ఎన్ గీతారెడ్డి సందర్శించారు. తయారైన తలుపులు, కలశాలు బాగున్నాయంటూ తయారీదారులను అభినందించారు.