రూట్‌‌‌‌‌‌‌‌ సెంచరీ ఇంగ్లండ్ 384 ఆలౌట్‌‌‌‌‌‌‌‌... ట్రావిస్ మెరుపులతో ఆస్ట్రేలియా 166/2

రూట్‌‌‌‌‌‌‌‌ సెంచరీ ఇంగ్లండ్ 384 ఆలౌట్‌‌‌‌‌‌‌‌... ట్రావిస్ మెరుపులతో ఆస్ట్రేలియా 166/2

సిడ్నీ : ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ ఐదో టెస్టు నువ్వానేనా అన్నట్టు సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు సమాన స్థితిలో నిలిచాయి. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (160)  భారీ సెంచరీతో తమ జట్టుకు మంచి స్కోరు అందిస్తే..  కంగారూ టీమ్‌‌‌‌‌‌‌‌ డేంజర్ మ్యాన్ ట్రావిస్ హెడ్ (87 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 15 ఫోర్లతో 91 నాటౌట్‌‌‌‌‌‌‌‌) మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌తో ధీటైన సమాధానం ఇచ్చాడు. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 311/5 తో సోమవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ 384  రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. వెటరన్ బ్యాటర్ జో రూట్ ఆస్ట్రేలియా గడ్డపై తన  బెస్ట్ పెర్ఫామెన్స్ చేశాడు. 

ఈ క్రమంలో టెస్టు క్రికెట్‌‌‌‌‌‌‌‌లో అత్యధిక సెంచరీలు (41) చేసిన  ప్లేయర్ల లిస్ట్‌‌‌‌‌‌‌‌లో రికీ పాంటింగ్ సరసన చేరాడు. హ్యారీ బ్రూక్ (84), జెమీ స్మిత్ (46), విల్ జాక్స్ (27) కూడా రాణించగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (0), బ్రైడన్ కార్స్ (1) ఫెయిలయ్యారు.  ఆస్ట్రేలియా బౌలర్లలో మైకేల్ నెసర్ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా  రెండో రోజు ఆట ముగిసే సమయానికి 166/2 స్కోరుతో నిలిచింది. ఓపెనర్ జేక్ వెథరాల్డ్ (21) త్వరగానే  పెవిలియన్ చేరినా..ట్రావిస్ హెడ్ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 

మార్నస్ లబుషేన్ (48) తో కలిసి రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 105 రన్స్ జోడించాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీసి ఆస్ట్రేలియా జోరుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశాడు. సెంచరీకి చేరువైన హెడ్‌‌‌‌‌‌‌‌తో పాటు నెసర్ (1 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉండగా..  ఇంగ్లండ్ స్కోరుకు ఆసీస్ ఇంకా 218 రన్స్ దూరంలో నిలిచింది.