IPL 2024: ముగ్గురు సరిపోరు.. రెటైన్ ప్లేయర్లపై ఫ్రాంచైజీల డిమాండ్

IPL 2024: ముగ్గురు సరిపోరు.. రెటైన్ ప్లేయర్లపై ఫ్రాంచైజీల డిమాండ్

ఏప్రిల్ 16న ఐపీఎల్‌ ఫ్రాంచైజీల ఓనర్లతో బీసీసీఐ పెద్దలు సమావేశం కానున్నారు. ఇప్పటికే మొత్తం 10 మంది ఐపీఎల్ టీమ్ ఓనర్లకు బోర్డు ఆహ్వానాలు పంపింది. ఈ భేటీకి నిర్దిష్ట ఎజెండా అంటూ ఏమీ లేనప్పటికీ.. ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి మెగా వేలం, ఆటగాళ్ల రిటెన్షన్‌, రైట్ టు మ్యాచ్ కార్డ్‌, పర్స్‌ వ్యాల్యూ తదితర అంశాలు చర్చకు రావచ్చని తెలుస్తోంది. ఈ మెగా  వేలంలో ప్లేయర్ల రెటైన్ విషయంలో ఫ్రాంచైజీలు సంతృప్తిగా లేరని తెలుస్తుంది. 

నివేదికల ప్రకారం.. ఎక్కువ మంది ఫ్రాంచైజీలు  ప్లేయర్ రిటెన్షన్ విధానంలో మార్పులు కోరుకుంటున్నారు. తమ జట్టులో ఎక్కువ మంది ఆటగాళ్లను ఉండాలని కోరుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. 2022 మెగా వేలానికి ముందు ప్రకారం.. ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో సహా నలుగురు ఆటగాళ్లను ఉంచుకోవడానికి జట్లకు అనుమతించబడింది. దీంతో పాటు మరొక అదనపు ఆటగాడిని దక్కించుకోవడం కోసం రైట్-టు-మ్యాచ్ కార్డ్ ఇవ్వబడింది.

ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి మెగా వేలం వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జరగవచ్చని భావిస్తున్నారు. అంతకుముందు జరిగే ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ నియమ నిబంధనల గురించి ఈ భేటీలో చర్చించవచ్చని తెలుస్తోంది. రిటైన్‌ విషయంలో జట్ల యాజమాన్యాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. రిటైన్‌ చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్యపై ఏకాభిప్రాయం లేదు.