Allu Arjun: "ఇది సంక్రాంతి బాస్-బస్టర్!".. 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీపై అల్లు అర్జున్ ప్రశంసలు!

Allu Arjun: "ఇది సంక్రాంతి బాస్-బస్టర్!".. 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీపై అల్లు అర్జున్ ప్రశంసలు!

మెగాస్ఠార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని కాసుల వర్షం కురిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు, సెలబ్రిలీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

బాస్ ఈజ్ బ్యాక్.. ఇది సంక్రాంతి బాస్-బస్టర్!

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా ఎమోషనల్ఎనర్జిటిక్ పోస్ట్ చేశారు. మామయ్య చిరంజీవి నటనను, అనిల్ రావిపూడి మేకింగ్‌ను ఆకాశానికెత్తేశారు. ముందుగా  'మన శంకర వరప్రసాద్ గారు' టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు. The BOSS IS BACK! మన మెగాస్టార్ చిరంజీవి గారిని మళ్ళీ స్క్రీన్ మీద అలా చూడటం చాలా సంతోషంగా ఉంది. ఇది పక్కా వింటేజ్ లుక్ ను తీసుకువచ్చిందని కొనియాడారు. 

Also Read : మ్యారేజ్ రూమర్స్‌ వేళ మృణాల్ స్పెషల్ పోస్ట్

వెంకీ మామ, నయనతార..

"వెంకీ మామ రాక్డ్ ది షో! #VenkyGowda పాత్రలో చాలా బాగా చేశారు అని అల్లు అర్జున్ ప్రశంసించారు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార తన గ్రేషియస్ ప్రెజెన్స్‌తో, క్యాథరిన్ ట్రెసా తన హ్యూమర్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. సంక్రాంతి స్టార్ 'బుల్లిరాజు' పెర్ఫార్మెన్స్, ముఖ్యంగా 'కోరికతను కోరికతను' కామెడీ సీక్వెన్స్‌ను చూసి తెగ నవ్వుకున్నానని బన్నీ చెప్పుకొచ్చారు. హుక్ స్టెప్, మెగా విక్టరీ పాటలు విజిల్స్ వేయించేలా ఉన్నాయి అని కితాబిచ్చారు. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాణ విలువలను మెచ్చుకుంటూ..  అనిల్ రావిపూడిని 'సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మెషిన్' అని అభివర్ణించారు. "సంక్రాంతికి వస్తారు - హిట్ కొడతారు - రిపీటు" అంటూ బన్నీ చేసిన కామెంట్ మెగా అభిమానుల్లో జోష్ నింపింది.

 

మూవీ మేకర్స్ కృతజ్ఞతలు

అల్లు అర్జున్ చేసిన ఈ పాజిటివ్ పోస్ట్‌పై చిత్ర యూనిట్ ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. ఐకాన్ స్టార్ ప్రశంసలు తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయని నిర్మాతలు సుస్మిత కొణిదెల , సాహు గారపాటి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మీలాంటి స్టార్ నుంచి ఇలాంటి మాటలు రావడం మా టీమ్ మొత్తానికి దక్కిన గొప్ప గౌరవం. సినిమాను మీరు అంతలా ఎంజాయ్ చేయడం మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది అంటూ రిప్లై ఇచ్చారు.

మెగా విక్టరీ కాంబో మేజిక్!

 చిరంజీవి, వెంకటేష్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి, చిరంజీవి మాస్ ఎలిమెంట్స్ తోడవ్వడం ఈ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది. 2026 సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఈ  'మన శంకర వరప్రసాద్ గారు' కేవలం బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదు, అల్లు అర్జున్ చెప్పినట్లు ఇది పక్కా 'బాస్-బస్టర్' గా నిలుస్తోంది.!