ఓటమెరుగని జర్మనీ బాక్సర్ ..రింగ్ లోనే గుండెపోటుతో మృతి

ఓటమెరుగని జర్మనీ బాక్సర్ ..రింగ్ లోనే గుండెపోటుతో మృతి

టమి ఎరుగని జర్మనీకి చెందిన చాంపియన్ బాక్సర్ మూసా అస్కాన్ యమక్ (38) గుండెపోటుతో మరణించంతో బాక్సింగ్ ప్రపంచం మరో స్టార్‌ను కోల్పోయింది. బాక్సింగ్ రింగ్ లో ఇప్పటిదాకా ఓటమన్నదే ఎరుగని దిగ్గజ బాక్సర్ ను మృత్యువు ఓడించింది. 

మ్యూనిచ్ నగరంలో గత శనివారం (ఈనెల 14వ తేదీ) రాత్రి మూసా అస్కాన్ యమక్ ఉగాండాకు చెందిన హమ్జా వండెరాతో తలపడుతుండగా.. మూడో రౌండ్ ప్రారంభానికి ముందు మూసా యమక్ మెల్లగా ముందుకు ఒరిగిపోయాడు. దాంతో ఈ పోటీని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారే కాదు, ప్రపంచవ్యాప్తంగా లైవ్ లో వీక్షిస్తున్నవారు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. 

ఈ పోరు రెండో రౌండ్ లో ప్రత్యర్థి హంజా విసిరిన పంచ్ యమక్ ను బలంగా తాకింది. దాంతో, అతడి అడుగులు తడబడ్డాయి. సరిగా నిలుచోలేకపోయాడు. అయితే, మూడో రౌండ్ కొన్ని సెకన్లలో ప్రారంభమవుతుందనగా, యమాక్ గుండెపోటుకు గురయ్యాడు. డాక్టర్లు వెంటనే అతడికి ప్రథమ చికిత్స చేశారు. వెంటనే బౌట్ నిర్వాహకులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యమాక్ మరణించినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు. 

మూసా యమక్ ఇప్పటివరకు ఆడిన 8 ప్రొఫెషనల్ బౌట్లలో గెలుపొందాడు. అన్ని విజయాలు కూడా ప్రత్యర్థిని నాకౌట్ చేయడం ద్వారానే సాధించాడు. టర్కీ జాతీయుడైన మూసా యమక్ 2017లో ప్రొఫెషనల్ బాక్సర్ అవతారం ఎత్తాడు. 2021లో వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచాక అతడి పాపులారిటీ మరింత పెరిగిపోయింది. మూసా అస్కాన్ యమక్ ఆకస్మిక మరణంతో బాక్సింగ్​ వర్గాల్లో విషాదం నెలకొంది.

మరిన్ని వార్తల కోసం..

చనిపోయి బతికింది..ఐదుగురికి బతుకునిచ్చింది

జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టుకు సుప్రీం ఆదేశాలు