ఇంకా బోరు బావిలోనే బాలుడు

ఇంకా బోరు బావిలోనే బాలుడు

తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లా నడుకట్టుపట్టి లో బోరు బావిలో రెండేళ్ల బాలుడు విల్సన్ సుజిత్ శుక్రవారం రోజు రాత్రి 25 పీట్ల లోతు బోరు బావిలో పడిపోయాడు. ఆ బాలుడిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బోరుకు సమాంతరంగా మరో పెద్ద గొయ్యి కూడా తవ్వుతున్నారు. అయితే 10 అడుగుల లోతు గొయ్యి తవ్విన తర్వాత రాళ్లు అడ్డుగా వచ్చాయి. దీంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. రాళ్లను తొలగిస్తూ సొరంగం తవ్వుతున్నారు. అయితే సొరంగం తవ్వుతున్న సమయంలో సుజిత్ బోరు బావిలో మరింత కిందకు జారి పోయినట్లు అధికారులు తెలిపారు.

నడుకట్టుపట్టికి చేరుకున్న  ఆ రాష్ట్ర డిప్యూటీ  సీఎం పన్నీర్ సెల్వం పరిస్థితి పరిశీలించారు. బాలుడు 88 అడుగుల లోతులో ఉన్నట్లు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడికి పైపుల ద్వారా ఆక్సీజన్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న బోరు బావులను వెంటనే మూసివేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.