పెన్సిల్ పోయిందని కేసు పెడతాడంటా

V6 Velugu Posted on Nov 25, 2021

కర్నూలు జిల్లా: మంత్రాలయంలోని పెద్దకడుబూరులో ఓ పిల్లాడు చేసిన పని అందరికీ నవ్వు తెప్పిస్తుంది. ఫ్రెండ్ పెన్సిల్ దొంగిలించాడని హనుమంతు అనే బాలుడు  కేసు పెట్టేందుకు రెడీ అయ్యాడు. మిగతా స్టూడెంట్స్ తో కలిసి పంచాయితీ కోసం పోలీసుల దగ్గరకు వెళ్లాడు. అయితే చిన్నారి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లవాడిని కూడా పిలిపించారు. మరెప్పుడూ ఇలా చేయకూడదని హితవు పలికారు. దీంతో ఈ విషయంపై కేసు వద్దంటూ పోలీసులు హనుమంతుకు సర్దిచెప్పడం ఫన్నీగా ఉంది. ‘ఈ ఒక్కసారి రాజీ అవ్వురా, బెయిల్ దొరకడం కష్టం అవుతుంది’ అని హన్మంతుకు పోలీసులు నచ్చచెప్పారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి కూడా స్పందించారు. ఇది నూతన రాయలసీమ అంటూ ట్యాగ్‌ లైన్ పెట్టి ఈ వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 

 

Tagged POLICE, BOY, gone, complained, , pencil

Latest Videos

Subscribe Now

More News