కరోనా నుంచి విద్యార్ధుల్ని ఇలా కాపాడుకోవచ్చు : అందుబాటులోకి బ్రాస్ లెట్ టెక్నాలజీ

కరోనా నుంచి విద్యార్ధుల్ని ఇలా కాపాడుకోవచ్చు : అందుబాటులోకి  బ్రాస్ లెట్ టెక్నాలజీ

డ్రాగన్ కంట్రీ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుంది. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఆ దేశ ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగిస్తూ విద్యార్ధుల్ని కాపాడేలా చర్యలు తీసుకుంది.  సోమవారం నుంచి బీజింగ్ లో ఉన్న స్కూల్స్ ప్రారంభమయ్యాయి. కరోనా  సోకకుండా  విద్యార్ధుల్ని కాపాడేందుకు

చైనా టెక్నాలజీ డెవలప్ చేసింది. టెక్నాలజీలో భాగంగా  బీజింగ్ లో ఉన్న ఐదు జిల్లాల స్కూల్  విద్యార్ధులకు బ్రాస్ లెట్ తగిలించింది. ఓ యాప్ సాయంతో  బ్రాస్ లెట్ తగిలించుకున్న విద్యార్ధుల ఆరోగ్యం ఎలా ఉంది..? ఫీవర్ 37.2 డిగ్రీలు దాటితే వెంటనే సంబంధిత స్కూల్ యాజమాన్యానికి, పోలీసులకు, డాక్టర్లకు సిగ్నల్స్ వెళ్లేలా డిజైన్ చేసింది. ఆ సిగ్నల్స్ ఆధారంగా విద్యార్ధుల్ని ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందించేలా కొత్త ప్రయోగానికి  శ్రీకారం చుట్టింది.   అంతేకాదు స్కూల్స్, పబ్లిక్ పేసుల్లో ధర్మల్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఆ కెమెరాల ఆధారంగా ప్రజల్ని ఎల్లో,  గ్రీన్, రెడ్ ఇలా మూడు విభాగాలకు గుర్తించి వారిని ఆస్పత్రికి తరలిస్తారు.

బ్రాస్ లెట్ టెంపరేచర్ ను గుర్తిస్తుందని, నిరంతరం బ్రాస్ లెట్ ను ధరించమని విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు చెబుతున్నట్లు బీజింగ్ కు చెందిన టీచర్ డోంగ్లీ  బీజింగ్ డైలీకి తెలిపారు. మూడు నెలల లాక్ డౌన్ తరువాత బీజింగ్ లో అన్నీ స్కూల్లు ప్రారంభమయ్యాయి. విద్యార్ధులు తప్పని సరిగా మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలనే నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు మరో టీచర్ షియాంగ్ తెలిపారు.