ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

 ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరిరోజు స్వామివారికి ధ్వజావరోహణం నిర్వహించారు. ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం శ్రీవారి ఆలయం బయట పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. కన్నుల పండుగలా జరుగుతున్న ఉత్సవాలను తిలకించేందుకు.. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. నయనానందకరంగా సాగిన ధ్వజావరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.