
కన్నడ హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty) నటించి, దర్శకత్వం వచ్చిన మూవీ కాంతారా. సప్తమి గౌడ(Sapthami Gowda) హీరోయిన్ గా ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార(Kantara) సినిమా.. ఏకంగా రూ.450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కాంతార సినిమాపై ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపించారు.ఇక కాంతార మూవీ భారీ విజయం సాధించడంతో.. ఈ సినిమాకు ప్రీక్వెల్ ప్లాన్ చేశాడు దర్శకుడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది.
అయితే తాజాగా కాంతారా సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. కాంతార సినిమా కోసం కేవలం రూ.20 ఖర్చు చేసిన మేకర్స్.. ప్రీక్వెల్ కోసం ఏకంగా రూ.125 కోట్లు బడ్జెట్ ను ఖర్చు చేయనున్నారట. ఈ న్యూస్ చూసిన ఆడియన్స్ అవాక్కవుతున్నారు. సినిమా బడ్జెట్ రూ.125 కోట్లా.. ఈసారి కూడా ఎదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు రిషబ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా నుండి మొదలవనుందని సమాచారం. కేవలం 6 నెలల్లో సినిమాను పూర్తి చేసి 2024 సమ్మర్ కు సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరి ఈ సినిమా కాంతారని మించి హిట్ అవుతుందా? ఎన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలంటే 2024 సమ్మర్ వరకు ఆగాల్సిందే.