సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదు

సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదు

సీఏఏపై కొన్ని పార్టీలు విషప్రచారం చేస్తున్నాయని, అలాంటి పార్టీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్డులో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ కులస్తేతో కలిసి లక్ష్మణ్ పతంగులు ఎగురవేశారు. ‘వియ్ సపోర్ట్ సీఏఏ’ అని రాసి ఉన్న పతంగులు ఆకట్టుకున్నాయి. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఆనందంగా పండుగ జరుపుకోవాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ, అమిత్ షాల నిర్ణయాలకు సంఘీభావం తెలుపుతూ కైట్‌‌‌‌ ఫెస్టివల్‌‌‌‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మజ్లిస్‌‌‌‌కు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ దాసోహమైందని, భైంసా ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు.

సంక్రాంతి పండుగ సమయంలో ఓ వర్గం కవ్వించి దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారన్నారు. ఇకనైనా కేసీఆర్‌‌‌‌ పద్ధతి మార్చుకోకుంటే టీఆర్ఎస్‌‌‌‌కు పుట్టగతులుండవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్ రావు,సీనియర్లు మోత్కుపల్లి నర్సింహులు, అమర్ సింగ్ తిలావత్‌‌‌‌, బీజేవైఎం, మహిళామోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదు: కేంద్ర మంత్రి సీఏఏ ఎవరికీ వ్యతి రేకం కాదని కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ కులస్తే అన్నారు. ఈ చట్టం పౌరసత్వం ఇవ్వడానికే తప్ప ఏ ఒక్కరిదీ తీసేయడానికి కాదన్నారు. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేసే పార్టీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.