ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు

V6 Velugu Posted on Dec 04, 2021

పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుకనుంచి వచ్చి ఢీకొట్టడంతో మంటలంటుకున్నాయి. ఈసీఐఎల్ దమ్మాయిగూడకు చెందిన మయూర్ శంషాబాద్ నుంచి ఘట్కేసర్ వెళుతుండగా ఈ ప్రమాదమైంది. అటుగా వెళ్తున్న వాహనదారుడు కారులో మంటలను చూసి డ్రైవర్ ను బయటకి తీయడంతో ప్రమాదం తప్పింది. మయూర్ కు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కి తరలించారు. కాగా.. మంటలలో కారు పూర్తిగా దగ్ధమవ్వగా.. లారీ పాక్షికంగా దగ్ధమైంది. వాహనదారుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న హయత్ నగర్ ఫైర్ సిబ్బంది... మంటలను ఆర్పారు. ప్రమాదం జరిగిన సమయంలో మయూర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.

Tagged Hyderabad, car, accident, Lorry, outer ring road, Pedda Amberpet

Latest Videos

Subscribe Now

More News