పార్కింగ్ చేసిన కారు కాలిపోయింది

పార్కింగ్ చేసిన కారు కాలిపోయింది

 

శానిటైజరే కారణమా?

 

కరీం నగర్, వెలుగు: పార్కిం గ్ చేసిన కారు కాలిపోయిన ఘటన కరీం నగర్ లోని చైతన్యపురిలో జరిగింది. 57వ డివిజన్ చైతన్యపురిలోని ఆదర్శ అపార్ట్ మెంట్ లో ఉండే భాస్కర్ నా యక్ అనే కాం ట్రాక్టర్ శనివారం రాత్రి 10 గంటలకు కారును గ్రౌండ్ ఫ్లో ర్ లో పార్క్​ చే శారు. తెల్లవారుజామున 2 గంటలకు కారులోం చి పెద్ద శబ్దం వచ్చి మంటలంటుకున్నాయి . స్థా నికులు ఫైరిం జన్ కు కాల్ చేయడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల ధాటికి కారులోని సీట్లు కాలిపోగా ముం దు టైర్ లు, గ్లాస్ పేలిపోయాయి. కారు లోపల హ్యాండ్ శానిటైజర్ ఉంచి డోర్లు క్లోజ్ చేయడం వల్ల వేడి పుట్టి మంటలు వచ్చాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.