దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో తగ్గిన కరోనా కేసులు


దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో  16,935 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి  బారిన పడి మరో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 16,069 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 98.47 శాతానికి చేరుకుంది. మొత్తం కేసుల్లో యాక్టీవ్ కేసుల సంఖ్య 0.33 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు  4,37,67,534 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు 5,25,760 మంది కరోనా కాటుకు బలయ్యారు. ప్రస్తుతం 1,44,264 యాక్టీవ్ కేసులుండగా...ఇప్పటి వరకు 4,30,97,510 మంది కరోనాను జయించారు. మరోవైపు దేశంలో ఆదివారం 4,46,671 మందికి కరోనా టీకాలు వేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు200 కోట్ల వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేశారు. 


అటు ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. వరల్డ్ వైడ్గా గడిచిన 24 గంటల్లో  5,30,140 మందికి కొవిడ్ సోకింది. మరో 628 మంది కరోనా వల్ల మృతి చెందారు.  తాజా కేసులతో  మొత్తం కేసుల సంఖ్య 56,76,43,065కు చేరింది. ఇప్పటివరకు వైరస్ వల్ల  63,87,596 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 4,42,843 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 53,86,58,217 మంది కొవిడ్ను జయించారు.