సెన్సార్‌ బోర్డు సంచలన నిర్ణయం.. ఇక నుండి ఆ పద్ధతి ఉండదు

సెన్సార్‌ బోర్డు సంచలన నిర్ణయం.. ఇక నుండి ఆ పద్ధతి ఉండదు

తమిళ స్టార్ హీరో విశాల్‌(Vishal) నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ మార్క్‌ ఆంటోని(Mark Antony). ఈ సినిమా హిందీ వెర్షన్‌ సెన్సార్‌ విషయంలో లంచం ఇవ్వాల్సి వచ్చిందని  CBFC (Central Board of Film Certification)పై విశాల్ ఆరోపనలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా సెన్సార్‌ కోసం రూ. 6.5 లక్షలు లంచంగా ఇవ్వాల్సివచ్చిదని ఆయన చెప్పారు. దీంతో నటుడు విశాల్ చేసిన ఆరోపణలపై  కేంద్ర సమాచార, ప్రసార శాఖ బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. కీలక నిర్ణయం తీసుకుంది.

మార్క్ ఆంటోనీ సెన్సార్ విషయంలో విశాల్‌ను లంచం అడిగింది.. సెన్సార్‌ బోర్డు సభ్యులు కాదని, థర్డ్‌పార్టీ వారని  కేంద్ర సెన్సార్‌ బోర్డు ప్రకటించింది. ఈ కేసు విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సెన్సార్‌ బోర్డులో మళ్లీ ఇలాంటి పరిణామాలు పునరావృతం అవకుండా.. ఇకనుంచి ఆన్‌లైన్‌లోనే సినిమాల సెన్సార్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపింది సెంట్రల్‌ సెన్సార్‌ బోర్డు.

Also Read :- ప్రభాస్ను అలాగే చూపించండి.. కనీసం ట్రై చేయండి.. మంచు విష్ణుకు ఫ్యాన్స్ రిక్వెస్ట్

ఇందులో భాగంగా.. ఈ- సినీప్రమాన్‌లో మేకర్స్ రిజస్టర్‌ చేసుకోవాలని, ఈ ప్రక్రియలో కూడా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సెన్సార్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఏటా సుమారు 18వేల చిత్రాలు సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం CBFC వద్దకు వస్తుంటాయని,  అన్ని సినిమాలు చూడాలంటే సభ్యులకు సమయం పడుతుందని, కాబట్టి నిర్మాతలు కూడా తమ సినిమాలకు ముందు సెన్సార్‌ ఇ‍వ్వాలని కోరరాదని తెలిపింది.