ఖర్చు తగ్గించుకోవాలని శాఖలకు కేంద్రం ఆదేశం

ఖర్చు తగ్గించుకోవాలని శాఖలకు కేంద్రం ఆదేశం

ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌ వద్దు.. చేసినా అగ్గువలో అయిపోవాలె

న్యూఢిల్లీ: కరోనా వల్ల ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ తగ్గడంతో అనవసర ఖర్చులను కేంద్రం తగ్గించుకుంటోంది.  ఖర్చులను ఎట్లా మేనేజ్‌‌‌‌‌‌‌‌ చేయాలో, ఎక్కడెక్కడ తగ్గించుకోవాలో అన్ని శాఖలకు గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. ఇంపోర్టెడ్‌‌‌‌‌‌‌‌ పేపర్లపై పుస్తకాలు, డాక్యుమెంట్లు పబ్లిష్‌‌‌‌‌‌‌‌ చేయకూడదని ఇప్పటికే ఆదేశాలిచ్చిన సర్కారు.. శుక్రవారం మరికొన్ని మార్గదర్శకాలు రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఆయా శాఖలకు సెక్రటరీలే చీఫ్‌‌‌‌‌‌‌‌ అకౌంటింగ్‌‌‌‌‌‌‌‌ అథారిటీ కాబట్టి ఈ గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ను అమలు చేయాల్సిన బాధ్యత వాళ్లదేనని చెప్పింది. వీలైనంత వరకు ఫంక్షన్లు, కార్యక్రమాలు చేయొద్దని.. మరీ అవసరమైతే తక్కువలోనే పూర్తి చేయాలని పేర్కొంది. శాఖల్లో కన్సల్టెంట్లను వీలైనంత వరకు తగ్గించుకోవాలంది. వివిధ శాఖలు, సబార్డినేట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులు, చట్టబద్ధమైన, స్వతంత్ర సంస్థల్లో కొత్త పోస్టులను డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంటల్‌‌‌‌‌‌‌‌ అప్రూవల్‌‌‌‌‌‌‌‌ లేకుండా నియమించడం బ్యాన్‌‌‌‌‌‌‌‌ చేశామని చెప్పింది. ఈ బ్యాన్‌‌‌‌‌‌‌‌ అన్ని రకాల పోస్టులకు, అన్ని సంస్థలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పెండీచర్‌‌‌‌‌‌‌‌ అనుమతి లేకుండా ఏదైనా పోస్టును 2020 జులై 1 తర్వాత సృష్టించినట్టయితే అలాంటి పోస్టులోకి ఎవరినీ తీసుకోవద్దని చెప్పింది. ఆ పోస్టు కచ్చితంగా అవసరమైతే అప్రూవల్‌‌‌‌‌‌‌‌ కోసం ఆర్థిక శాఖకు పంపించాలంది.

For More News..

‘గివిట్ అప్’ డబ్బులతో కారు కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం

కరోనాతో ఊర్లు గావర.. పెరుగుతున్న కేసులు

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్