కరోనా గైడ్ లైన్స్,  నిబంధనలు జూన్ 30 వరకు

కరోనా గైడ్ లైన్స్,  నిబంధనలు జూన్ 30 వరకు


ఏప్రిల్ లో జారీ చేసిన   కరోనా గైడ్ లైన్స్,  నిబంధనలను  జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు  ప్రకటిచింది   కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు  హోం సెక్రటరీ   అజయ్ భల్లా. కేసులు  తగ్గుతున్నప్పటికీ  యాక్టివ్ కేసుల సంఖ్య  భారీగా ఉందన్నారు  అజయ్ భల్లా. కాబట్టి నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిందేనని సూచించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను  పూర్తిగా అంచనా  వేసిన తర్వాత  రాష్ట్రాలు  సడలింపులపై  నిర్ణయాలు  తీసుకోవాలన్నారు. కేసుల సంఖ్య తగ్గించేందుకు  సరైన వ్యూహాన్ని అమలు  చేయాలని  రాష్ట్రాలకు  సూచించారు. కరోనా కేసులు  భారీగా పెరగడంతో   ఏప్రిల్ 29 న  రాష్ట్రాలకు  గైడ్ లైన్స్  జారీ చేసింది కేంద్రం.  వైరస్  వ్యాప్తిని  అడ్డుకునేందుకు   కంటెయిన్ మెంట్  జోన్లు , గైడ్ లైన్స్ కఠినంగా అమలు  చేయాలని  సూచించింది.