రాష్ట్రానికి రెమ్డిసివిర్  కోటా డబుల్

రాష్ట్రానికి రెమ్డిసివిర్  కోటా డబుల్

హైదరాబాద్, వెలుగు:  కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణకు రెమ్డిసివిర్​ ఇంజక్షన్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్ల సరఫరాను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణకు ప్రస్తుతం రోజూ ఇస్తున్న 5,500 రెమ్డిసివిర్​ ఇంజక్షన్ల సంఖ్యను సోమవారం నుంచి 10,500కు పెంచుతున్నట్టు రైల్వే మంత్రి పీయూష్  గోయల్  చెప్పారు. అదనంగా 200 టన్నుల ఆక్సిజన్ ను  సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి పీయూష్​  గోయల్ ఫోన్ చేసి చెప్పారు. చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని భిలాయ్ నుంచి, ఒడిశాలోని అంగుల్ నుంచి, పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ నుంచి తెలంగాణకు ఆక్సిజన్ ను సరఫరా చేయాలని నిర్ణయించినట్టు  ఆయన తెలిపారు. సరఫరాకు సంబంధించి సమన్వయం చేసుకోవాలని కేసీఆర్ ను కోరారు. వ్యాక్సిన్ సెకండ్ డోస్ కు 
ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.