ఇన్‌‌‌‌‌‌‌‌స్టలేషన్‌‌‌‌‌‌‌‌ తర్వాత నుంచే ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై వారంటీ

ఇన్‌‌‌‌‌‌‌‌స్టలేషన్‌‌‌‌‌‌‌‌ తర్వాత నుంచే ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై వారంటీ
  • ఇన్‌‌‌‌‌‌‌‌స్టలేషన్‌‌‌‌‌‌‌‌ తర్వాత నుంచే వారంటీ
  • ఏసీల తయారీ కంపెనీలను ఆదేశించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ : ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు వంటి ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై ఇచ్చే వారంటీ, గ్యారెంటీ రూల్స్‌‌‌‌‌‌‌‌ను కొద్దిగా మార్చాలని కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. వీటికి డిమాండ్ పెరుగుతుండడంతో  ఈ  వస్తువులపై ఇచ్చే వారంటీ, గ్యారెంటీలను కొన్న రోజు నుంచి కాకుండా ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్ చేసిన రోజు నుంచి లెక్కించాలని తెలిపింది.  కన్జూమర్ అఫైర్స్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్‌‌‌‌‌‌‌‌ ఈ మార్పులు చేపట్టాలని  కంపెనీలకు, ఆర్గనైజేషన్లకు  లెటర్స్ రాశారు.  సీఐఐ, ఫిక్కీ, అసోచామ్‌‌‌‌‌‌‌‌, ఫీహెచ్‌‌‌‌‌‌‌‌డీ ఛాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ కామర్స్ అండ్  ఇండస్ట్రీ వంటి ఆర్గనైజేషన్లకు, శామ్‌‌‌‌‌‌‌‌సంగ్‌‌‌‌‌‌‌‌, ఎల్‌‌‌‌‌‌‌‌జీ, పానాసోనిక్‌‌‌‌‌‌‌‌, బ్లూ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెంట్‌‌‌‌‌‌‌‌, వోల్టాస్ వంటి కంపెనీలకు ఆయన లెటర్స్ పంపారు. 

ఫెస్టివల్ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఏసీలు,  వాషింగ్ మెషిన్లు వంటి వైట్‌‌‌‌‌‌‌‌ గూడ్స్ సేల్స్ బాగా జరుగుతున్నాయి. వారంటీ, గ్యారెంటీల విషయంలో కన్జూమర్లు లాభపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కాగా, కన్జూమర్ కొన్నాక  ఏసీలు వంటి ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌లు ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌లు వచ్చేంత వరకు ఇవి వాడకుండా పక్కన పడి ఉంటున్నాయి.