దేశవ్యాప్తంగా 12 యూనివర్శిటీలు క్లోజ్.. లోక్ సభలో వెల్లడించిన కేంద్రం

దేశవ్యాప్తంగా 12 యూనివర్శిటీలు క్లోజ్.. లోక్ సభలో వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ: 2014 నుంచి 2024 వరకు మొత్తం పదేళ్లలో దేశ వ్యాప్తంగా 12 ఫేక్ యూనివర్శిటీలు మూసివేయబడ్డాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ తెలిపారు. దేశంలోని నకిలీ యూనిర్శిటీలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి  చర్యలు తీసుకుంటుందని  లోక్ సభలో ప్రశ్నత్తోరాల సమయంలో ఓ సభ్యుడు ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు మంత్రి సుకాంత మజుందార్ ఆన్సర్ ఇచ్చారు. 2014 నుంచి 2024 వరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో యూజీసీ మొత్తం 21 నకిలీ యూనివర్శిటీలను గుర్తించిందని ఆయన తెలిపారు. ఇందులో 12 వర్శిటీలపై చర్యలు తీసుకుని మూసివేశామని పేర్కొన్నారు. 

Also Read :- ఈ నెల 17 వరకూ హైదరాబాద్ నుమాయిష్

మిగిలిన వాటికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. విద్యార్థులను మోసం చేయడం, తప్పుదారి పట్టించడంలో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. అలాగే.. తమ రాష్ట్రాల్లో ఉన్న నకిలీ వర్శిటీల వివరాలను యూజీసీ, కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవాలని కోరారు. విద్యార్థులు మోసపోకుండా ఫేక్ వర్శిటీల వివరాలను సోషల్ మీడియా, పబ్లిక్ డొమైన్లలో అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కేంద్రం మూసివేసిన 12 యూనివర్శిటీల్లో 2 విశ్వవిద్యాయాలు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనే ఉండటం గమనార్హం. 

రాష్ట్రాల వారీగా నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా 

  • ఆంధ్రప్రదేశ్      క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ
  • ఆంధ్రప్రదేశ్    బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా
  • ఢిల్లీ    ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ & ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (AIIPHS) 
  • ఢిల్లీ    కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్
  • ఢిల్లీ    యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ
  • ఢిల్లీ    ఒకేషనల్ విశ్వవిద్యాలయం
  • ఢిల్లీ    ADR-సెంట్రిక్ జురిడికల్ యూనివర్సిటీ
  • ఢిల్లీ    ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
  • ఢిల్లీ    విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్-ఎంప్లాయ్‌మెంట్ఢిల్లీ-110033
  • ఢిల్లీ    ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం)
  • కర్ణాటక    బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్శిటీ ఎడ్యుకేషన్ సొసైటీ
  • కేరళ    సెయింట్ జాన్స్ విశ్వవిద్యాలయం
  • కేరళ    ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రొఫెటిక్ మెడిసిన్ (IIUPM)
  • మహారాష్ట్ర    రాజా అరబిక్ విశ్వవిద్యాలయం
  • పుదుచ్చేరి    శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
  • ఉత్తర ప్రదేశ్    గాంధీ హిందీ విద్యాపీఠం
  • ఉత్తర ప్రదేశ్    నేతాజీ సుభాష్ చంద్రబోస్ విశ్వవిద్యాలయం (ఓపెన్ విశ్వవిద్యాలయం)
  • ఉత్తర ప్రదేశ్    భారతీయ శిక్షా పరిషత్
  • ఉత్తర ప్రదేశ్      మహామాయ సాంకేతిక విశ్వవిద్యాలయం
  • పశ్చిమ బెంగాల్    ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్
  • పశ్చిమ బెంగాల్    ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్

  •