రాష్ట్రాలకు డైరెక్ట్ గా విదేశీ టీకా

రాష్ట్రాలకు డైరెక్ట్ గా విదేశీ టీకా
  • ఎఫ్​డీఏ, డబ్ల్యూహెచ్​వో ఆమోదించిన 
  • వ్యాక్సిన్​లను దిగుమతి చేసుకోవచ్చు
  • రెండ్రోజుల్లోనే లైసెన్స్ జారీ చేస్తాం: కేంద్రం 
  • ఇతర కంపెనీలకు కొవాగ్జిన్ ఫార్ములా 
  • వచ్చేవారమే మార్కెట్లోకి స్పుత్నిక్ వీ టీకా

న్యూఢిల్లీ:   విదేశీ టీకాలను రాష్ట్రాలే నేరుగా దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. అమెరికాకు చెందిన ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ)’ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ఆమోదం పొందిన ఏ టీకాను అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చని గురువారం నీతి ఆయోగ్ మెంబర్ (హెల్త్),  నేషనల్ కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పాల్ ప్రకటించారు. విదేశీ టీకాలను కొనుగోలు చేసేందుకు ఒకటి, రెండు రోజుల్లోనే రాష్ట్రాలకు ఇంపోర్ట్ లైసెన్స్ జారీ చేస్తామన్నారు. ప్రస్తుతం కేంద్రం వద్ద ఇంపోర్ట్ లైసెన్సు దరఖాస్తులేవీ పెండింగ్​లో లేవన్నారు. అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలతో కూడా మొదటి నుంచీ  సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన చెప్పారు. ఇండియాకు డోసులు పంపినా లేదా ఇక్కడే తయారు చేయాలని అనుకున్నా పార్ట్​నర్ కంపెనీలను కూడా సిద్ధం చేస్తామని చెప్పామన్నారు.

కొవాగ్జిన్ ఫార్ములా ఇస్తాం.. 

కొవాగ్జిన్ కరోనా టీకా తయారీ ఫార్ములాను ఇతర కంపెనీలకు ఇచ్చేందుకు భారత్ బయోటెక్ కంపెనీ అంగీకరించిందని వీకే పాల్ చెప్పారు. రాష్ట్రాలకు డైరెక్టుగా విదేశీ టీకా‘‘పలు రాష్ట్రాల్లో టీకాలకు షార్టేజ్ ఏర్పడినందున ఇతర కంపెనీల్లో కొవాగ్జిన్ ఉత్పత్తికి అనుమతించాలన్న విజ్ఞప్తులు వచ్చాయి. ఈ ప్రపోజల్ ను భారత్ బయోటెక్ తో చర్చించగా, ఆ కంపెనీ ఓకే చెప్పింది. అయితే బతికి ఉన్న కరోనా వైరస్ ను ఇనాక్టివేట్ చేసి భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేశాయి. లైవ్ వైరస్ ను బయోసేఫ్టీ లెవల్ (బీఎస్ఎల్) 3 ల్యాబ్ లలో మాత్రమే కల్చర్ చేసి, టీకా తయారు చేసేందుకు వీలవుతుంది. ప్రస్తుతం దేశంలోని ఇతర కంపెనీల్లో ఈ ల్యాబ్స్ లేవు” అని ఆయన తెలిపారు. కొవాగ్జిన్ ఉత్పత్తికి ముందుకు వచ్చే కంపెనీలు బీఎస్ఎల్3 ల్యాబ్, టెక్నాలజీని సమకూర్చుకునేందుకు సహకారం అందిస్తామన్నారు. 

నేడు రెండో బ్యాచ్ స్పుత్నిక్ టీకాలు 

రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ కరోనా టీకా వచ్చే వారంలోనే మార్కెట్లోకి రావొచ్చని వీకే పాల్ అన్నారు. ఇప్పటికే స్పుత్నిక్ వీ ఫస్ట్ బ్యాచ్ కింద 1.5 లక్షల వయెల్స్ మే 1న హైదరాబాద్ కు చేరాయని, శుక్రవారం (మే 14) సెకండ్ బ్యాచ్ టీకాలు కూడా రష్యా నుంచి వస్తున్నాయని ఆయన తెలిపారు. త్వరలోనే స్పుత్నిక్ వీ సేల్స్ స్టార్ట్ అవుతాయన్నారు. మనదేశంలో స్పుత్నిక్ వీ టీకాను హైదరాబాద్ కు చెందిన రెడ్డీస్ ల్యాబొరేటరీస్ మార్కెటింగ్ చేస్తోంది. స్పుత్నిక్ వీ కూడా మార్కెట్లోకి వస్తే దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ తర్వాత అందుబాటులోకి వచ్చే మూడో కరోనా వ్యాక్సిన్ కానుంది.