కేవీల్లో సీట్ల కోసం ఇకపై ఎంపీల సిఫారస్లు చెల్లవు

కేవీల్లో సీట్ల కోసం ఇకపై ఎంపీల సిఫారస్లు చెల్లవు

న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటాను రద్దుచేస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ప్రతీ ఎంపీకి కేంద్రీయ విద్యాలయంలో పది సీట్ల వరకు సిఫార్సు చేసే అవకాశం ఉండేది. తాజా ఉత్వర్వులతో కేంద్రీయ విద్యాలయాల్లో సీట్ల కోసం ఎంపీల రెకమెండేషన్లకు అవకాశం లేకుండాపోయింది. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్ల మీద కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఎంపీ కోటా సీట్లు పెంచాలని కొందరూ, ఎత్తేయాలని మరికొందరూ వాదిస్తూ వస్తున్నారు. గతంలో లోక్ సభలో కూడా ఈ అంశంపై చాలా సార్లు చర్చలు జరిగాయి. చివరకు కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ఇవి కూడా చదవండి..

ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు

అక్బరుద్దీన్పై నమోదైన కేసుల కొట్టివేత