కాళేశ్వరం థర్డ్‌‌ టీఎంసీకి పర్మిషన్‌‌ తీసుకోండి

కాళేశ్వరం థర్డ్‌‌ టీఎంసీకి పర్మిషన్‌‌ తీసుకోండి

కాళేళ్వరంలోని థర్డ్ టీఎంసీకి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ తెలంగాణకు లేఖ రాశారు. తెలంగాణ నిర్మిస్తోన్నకాళేశ్వరం ప్రాజెక్టుకు 2018 జూన్‌‌లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీ అనుమతులిచ్చిందన్నారు . కానీ ఆ ప్రాజెక్టును రోజుకు 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలు లిఫ్ట్‌‌ చేసేలా అదనపు పనులు చేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం తమకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. థర్డ్‌‌టీఎంసీ తరలింపునకు అవసరమైన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. దేవాదుల థర్డ్‌‌ ఫేజ్‌, సీతారామ లిఫ్ట్‌‌, తుపాకులగూడెం బ్యారేజీ, డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయ్‌‌ ప్రాజెక్టు, లోయర్‌ పెన్‌‌గంగాపై నిర్మిస్తోన్నబ్యారేజీలు, రామప్ప పాకాల లేక్‌‌ డైవర్షన్‌‌స్కీంలకు జీఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ టెక్నికల్‌ అప్రైజల్‌, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేవని, వాటికీ పర్మిషన్లు తీసుకోవాలన్నారు. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లు పదో తేదీలోగా ఇవ్వాలని జూన్‌‌ 5న నిర్వహించిన జీఆర్‌ఎంబీ 9వ సమావేశంలో బోర్డు చైర్మన్‌‌ ఆదేశించారని, అయినా ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. టెక్నికల్‌ అప్రైజల్‌ కోసం డీపీఆర్‌లనువెంటనే జీఆర్‌ఎంబీకి సమర్పించాలని సూచించారు.

సంగమేశ్వరానికి పర్మిషన్ లేదు టెండర్లు ఆపండి..