
సుప్రీంకోర్టు సీజే జస్టిస్ యూయూ లలిత్
న్యూఢిల్లీ : కేసుల లిస్టింగ్ కోసం కొత్త మెకానిజాన్ని అందుబాటులోకి తెస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ వెల్లడించారు. అత్యవసరంగా విచారించాల్సిన కేసులను కోర్టు ముందుకు తీసుకురావడానికి బదులు.. రిజిస్ట్రార్ దగ్గర మెన్షన్ చేయాలని లాయర్లకు సూచించారు. ‘‘గురువారం నుంచి కొత్త వ్యవస్థ వస్తుంది. అప్పటిదాకా మేం కేసులను చాంబర్‌లో పరిశీలిస్తాం. అత్యవసరమైతే లిస్ట్ చేస్తాం. వాటిని కోర్టు ముందు మెన్షన్ చేసేందుకు సంబంధించి.. రిజిస్ట్రార్ ముందు ప్రస్తావించే అసలు పద్ధతికి వెళ్తాం” అని చెప్పారు. పిటిషన్లను బెంచ్ ముందు ప్రస్తావించేందుకు సంబంధించిన మెకానిజం గురించి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లేవనెత్తగా సీజేఐ ఈ కామెంట్స్ చేశారు. సీజేఐగా జస్టిస్ లలిత్‌కు సోమవారమే తొలి వర్కింగ్ డే. సీజేఐ ఆధ్వర్యంలోని బెంచ్ ప్రొసీడింగ్స్ ప్రారంభించగా.. తుషార్ మెహతా, సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే తదితరులు విష్ చేశారు.
తొలిరోజు 900 పిటిషన్లు
సోమవారం ఒక్కరోజే 60 పిల్స్ సహా 900 పిటిషన్లు సుప్రీంలో విచారణ కోసం లిస్ట్ అయ్యాయి.
రాఫెల్‌పై విచారణకు సుప్రీం నో
న్యూఢిల్లీ : 36 రాఫెల్ జెట్ల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో ఇండియా చేసుకున్న ఒప్పందంపై మరోసారి దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిల్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. డీల్‌కు సంబంధించిన తాజా సాక్ష్యాధారాలను సేకరించేందు కు ‘లెటర్స్ రెగేటరీ’ జారీ చేయాలని ఈ పిల్‌లో న్యాయవాది ఎంఎల్ శర్మ కోరారు. రాఫెల్ ఒప్పందం కుదుర్చుకునేందుకు దస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ ఓ మధ్యవర్తికి ఒక బిలియన్ యూరోలు ఇచ్చిందన్న మీడియా కథనాల గురించి ప్రస్తావించారు. అయితే సీజేఐ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం.. పిల్‌ను విచారణకు స్వీకరించేందుకు ఒప్పుకోలేదు. దీంతో తన పిల్‌ను శర్మ విత్ డ్రా చేసుకున్నారు.