కేంద్రం ఏమిచ్చిందో సీఎంనే అడగాలి: ఏలేటి

కేంద్రం ఏమిచ్చిందో సీఎంనే అడగాలి: ఏలేటి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో సీఎం రేవంత్ రెడ్డినే అడగాలని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది పేదల బడ్జెట్ అని చెప్పారు. దేశ యువతకు పెద్దపీట వేసేలా ఉందని, సామాజిక కళలను సాకారం చేసే విజనరీ బడ్జెట్​అని కొనియాడారు. దేశాభివృద్ధిని కోరుకునే వాళ్లంతా బడ్జెట్ కు మద్దతు ప్రకటించాలని కోరారు. 

రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో పదే పదే ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని అడగాలని సూచించారు. కేంద్రం నుంచి నిధులను రాబట్టే విషయంలో రేవంత్ రెడ్డి ఆయన గురువు చంద్రబాబును చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.