ఇన్​ఫెక్షన్లతోనే ఇద్దరు బాలింతల మృతి.. కమిటీ రిపోర్టులో ఏముంది..?

ఇన్​ఫెక్షన్లతోనే ఇద్దరు బాలింతల మృతి.. కమిటీ రిపోర్టులో ఏముంది..?

హైదరాబాద్​ : మలక్ పేట్ ఏరియా హాస్పిటల్ లో బాలింతల మృతిఘటనపై ఏర్పాటు చేసిన కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసింది. స్టెఫలో కోకస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తో ఇద్దరు మృతి చెందారని నిర్థారించింది. అదే మలక్​ పేట్ ఏరియా ఆస్పత్రిలో 18 మందికి డెలివరీ జరగగా... అందరికీ ఇన్ఫెక్షన్ సోకడంతో వారిని నిమ్స్ కు తరలించారు. ఇద్దరు బాలింతలకు కిడ్నీ ఇన్ఫెక్షన్ సోకడంతో డయాలసిస్ చేస్తున్నారు. మిగతావారు కోలుకోవడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే.. ఇన్ఫెక్షన్లకు గల కారణాలు ఏంటన్నది ఇప్పటివరకూ ప్రకటించలేదు. బాధితులకు చేసిన టెస్టులో వారికి స్టెఫలోకోకస్ అనే బ్యాక్టీరియాలు సోకినట్లు డాక్టర్లు గుర్తించారు.