
నటిగానే కాక నిర్మాతగానూ మెప్పిస్తున్న నీహారిక కొణిదెల.. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై మరో కొత్త చిత్రం నిర్మించబోతున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆమె.. ఆ చిత్ర దర్శకుడు యదు వంశీతో మరో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌కు వెళ్లబోతున్నట్టు సమాచారం.
కొత్త నటీనటులతో తెరకెక్కించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం కమర్షియల్‌గా మెప్పించడంతో పాటు రెండు కేటగిరీస్‌లో గద్దర్ అవార్డులను కూడా గెల్చుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వంలో నిహారిక ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.