
- జవహర్‌నగర్‌లో బాధితుల ఆందోళన
జవహర్ నగర్, వెలుగు: జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కార్మిక నగర్ లోని జయశంకర్ నగర్ కాలనీలో ప్లాట్లు కొనుక్కున్న తమను ఇండ్లు కట్టుకోకుండా అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త అడ్డుపడుతున్నాడని ఆదివారం కొందరు ఆందోళన చేపట్టారు. పైసా పైసా కూడబెట్టి 2018లో రూ.5లక్షల చొప్పున ప్లాట్లు కొనుక్కున్నామని, ఇప్పుడు ఇండ్లు కట్టుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంటే జవహర్ నగర్ 3వ డివిజన్ కార్పొరేటర్ భర్త బల్లి శ్రీనివాస్ అడ్డుపడ్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సైట్ దగ్గరికి వెళ్తే రౌడీలు, గూండాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. పోలీసులు, తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.