కర్ణాటక హోం మంత్రిగా డీకే !.. ఇచ్చిన హామీలు ఇవేనా..

కర్ణాటక హోం మంత్రిగా డీకే !.. ఇచ్చిన హామీలు ఇవేనా..

కర్నాటక పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఉత్కంఠకు తెరపడింది. సీఎం పీఠం కోసం సిద్ధరామయ్యతో పోటీపడిన డీకే శివకుమార్ ను బుజ్జగించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పలు హామీలు ఇచ్చింది. మొదటి రెండున్నరేళ్లు కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య, ఆ తర్వాత రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా చేస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. అంతేకాదు.. కర్నాటక సీఎం పీఠంపై గంపెడాశలు పెట్టుకున్న డీకేను బుజ్జగించేందుకు హైకమాండ్ చాలా శ్రమించాల్సి వచ్చింది. అందుకే ఆయన డిమాండ్ల చిట్టాకు మొగ్గుచూపింది. 

ఇందులో భాగంగానే డీకేకు డిప్యూటీ సీఎం పదవితో పాటు.. హోంశాఖ మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారు. వచ్చే ఐదేళ్ల పాటు కర్నాటక పీసీసీ చీఫ్ గా కొనసాగే అవకాశం కూడా ఇచ్చింది. అంతేకాదు.. డీకే శివకుమార్ సూచించిన ఆరుగురికి కీలకమైన మంత్రి పదవులు ఇస్తామని కూడా హామీ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం.