తుక్కుగూడ సభకు 10 లక్షల మంది

తుక్కుగూడ సభకు 10 లక్షల మంది
  •     జన సమీకరణపై కాంగ్రెస్ ​ఫోకస్ 

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థా యి ఎన్నికల మేనిఫెస్టోను ఈ నెల 6న తుక్కుగూడలో నిర్వహించనున్న సభలో విడుదల చేయనుంది. సభకు కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. దీంతో ఈ సభను సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభకు భారీగా జనసమీకరణ చేయడంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్​చార్జ్ లకు బాధ్యతలు అప్పగించిన సీఎం మంగళవారం వారితో సమావేశమై జన సమీకరణపై చర్చించనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను తుక్కుగూడలో నిర్వహించిన సభలోనే సోనియా గాంధీతో ప్రకటింపజేసి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ కనీసం 14 ఎంపీ సీట్లను గెలవాలనే లక్ష్యంతో ఉండడం, లోక్ సభ ఎన్నికల జాతీయ మేనిఫెస్టోను, ఇందులో ఐదు న్యాయ్ గ్యారంటీలను ఈ సభలోనే ప్రకటించనుండడంతో ఈ సభకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. అందుకే దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు పీసీసీ ప్రణాళికలువేస్తున్నది.