
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రాణాలకు తెగించి వ్యక్తిని కాపాడాడు ఓ కానిస్టేబుల్. భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచలోని, శ్రీనగర్ కాలనీలో సురేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో స్నానం కోసం బావి దగ్గరకు వెళ్లాడు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న సురేష్ ప్రమాదవశాత్తూ బావిలో జారీ పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే100 కు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల్లో కానిస్టేబుల్ అంజయ్య ధైర్యంతో బావిలోకి దూకాడు. ప్రాణాలకు తెగించి సురేష్ ను ఒడ్డుకు చేర్చాడు కానిస్టేబుల్ అంజయ్య. దీంతో సురేష్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఉన్నతాధికారులు కానిస్టేబుల్ అంజయ్యను అభినందించారు.