ఫేక్ రివ్యూల కట్టడికి ప్రభుత్వం కొత్త నిబంధనలు

ఫేక్ రివ్యూల కట్టడికి ప్రభుత్వం కొత్త నిబంధనలు

ప్రొడక్ట్ అయినా, ప్లేస్ అయినా, హోటల్స్ అయినా రివ్యూస్, రేటింగ్స్ చూసే కస్టమర్లు వాటిపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే కొన్ని ఈ కామర్స్ వెబ్ సైట్స్, ఆన్ లైన్ సెల్లర్స్ ఫేక్ రివ్యూస్, రేటింగ్స్ పెట్టి కస్టమర్లను మోసం చేస్తున్నారు. వీటిని అరికట్టడానికి కన్జ్యూమర్ ఎఫైర్స్ మినిస్ట్రీ కొత్త నిబంధనలను జారీచేసింది. ఇకపై ఈ-కామర్స్ వెబ్ సైట్స్, కన్స్యూమర్ డ్యూరబుల్ సైట్లు తప్పనిసరిగా వాటిని పాటించాలని స్పష్టం చేసింది.

ఈ ఏడాది జూన్ 10న ఫేక్ రివ్యూస్, రేటింగ్స్ పై అధ్యయనానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఓ కమిటీ ఏర్పాటుచేశారు. వాళ్లు ఈ సైట్లపై స్టడీ చేసి కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు. అందులో.. ఎవరైనా రివ్యూని పోస్ట్ చేశాక దాన్ని డిలిట్, ఎడిట్ చేయలేరు. ఇచ్చిన రివ్యూ నిజమైనదేనా కాదా అన్నది కూడా టెస్ట్ చేస్తారు. ఇందుకోసం వినియోగదారులు కొన్ని షరతులను అంగీకరించాల్సి ఉంటుంది. తర్వాత ఆ రివ్యూని టూల్స్ లేదా మాన్యువల్‌గా ఫిల్టర్ చేస్తారు. ఎవరైనా తప్పడు రివ్యూ, రేటింగ్ ఇస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.