గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

టూరిస్ట్ స్టేట్ గోవాలో బీజేపీ సత్తా చాటుతోంది. కమలం పార్టీ అధికారం కైవసం చేసుకునే దిశగా కనిపిస్తోంది. తొలి రౌండ్ నుంచి బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది.రాష్ట్రంలో మొత్తం 40 సీట్లు ఉండగా..బీజేపీ 18 సీట్లలో లీడ్ లో ఉంది.  మ్యాజిక్ ఫిగర్ కు కేవలం మూడు సీట్ల దూరంలో ఉంది. కాంగ్రెస్ 12, ఆప్ 3, టీఎంపీ 4, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. అయితే గోవాలో మాత్రం బీజేపీ  అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే ఆప్, టీఎంసీ కీ రోల్ పోషించే అవకాశం ఉంది. అందుకే గోవాలో క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ చేశాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే గోవాలో కమలం పార్టీదే అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం ప్రమోద్ సావంత్.బీజేపీ స్పష్టమైన మెజార్టీ రాకపోతే ఇండిపెండెంట్స్ ల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు.