గ్రౌండ్‌‌‌‌ వాటర్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేసిన ప్రభుత్వం

గ్రౌండ్‌‌‌‌ వాటర్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేసిన ప్రభుత్వం
  • భూగర్భంలో 680  టీఎంసీలున్నయ్‌‌‌‌
  • గ్రౌండ్‌‌‌‌ వాటర్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: భూగర్భంలో 680 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయని, ఏడేండ్లలో భూగర్భ జల మట్టం 4.26 మీటర్లు పెరిగిందని ఇరిగేషన్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌ రజత్‌‌‌‌ కుమార్‌‌‌‌ తెలిపారు. శుక్రవారం జలసౌధలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశంలో ‘‘డైనమిక్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ వాటర్‌‌‌‌ రీసోర్సెస్‌‌‌‌ కంప్యూటెడ్‌‌‌‌ ఫర్‌‌‌‌ తెలంగాణ స్టేట్‌‌‌‌ 2022’’రిపోర్టును విడుదల చేశారు. రాష్ట్రంలోని 83 మండలాల్లో భూగర్భ జల మట్టం పెరిగిందని, దేశంలోనే ఇది అత్యధికమని తెలిపారు.

మిషన్‌‌‌‌ కాకతీయతో 27,472 చెరువులు పునరుద్ధరించడం, కాళేశ్వరం, ఆన్‌‌‌‌గోయింగ్‌‌‌‌ ప్రాజెక్టులతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. నీళ్లు ఇంకేలా చెక్‌‌‌‌డ్యాంలు, రీచార్జ్‌‌‌‌ షాఫ్ట్‌‌‌‌లు నిర్మించడం, ఇతర చర్యల వల్ల భూగర్భ జలాలు పెరిగాయని వెల్లడించారు. 2020తో పోల్చితే భూగర్భం నుంచి నీటిని తోడేయడం 8 శాతం తగ్గిందన్నారు. ఈ 8 ఏండ్లలో 4.8 శాతానికి పెరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా భూగర్భ జల పరిరక్షణ, సమర్థ వినియోగానికి గ్రౌండ్‌‌‌‌ వాటర్‌‌‌‌, ఇండస్ట్రీస్‌‌‌‌, అగ్రికల్చర్‌‌‌‌, పంచాయతీరాజ్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ అధికారులతో సబ్‌‌‌‌ కమిటీ ఏర్పాటు చేశారు.