వీళ్లు పెద్ద తోపు.. దళిత సర్పంచ్ కుటుంబాన్నే బహిష్కరించారు

వీళ్లు పెద్ద తోపు.. దళిత సర్పంచ్ కుటుంబాన్నే బహిష్కరించారు

సిద్దిపేట జిల్లా: అవును.. ఇది ఎక్కడా కనివిని ఎరుగని ఘటన. వినడానికే వింతగా ఉన్న ఘటన. ఎక్కడో కాదు.. మన దగ్గరే జరిగింది. గుట్టుచప్పుడు కాకుండా.. బయటకు పొక్కకుండా తొక్కి పెట్టినా.. బాధితులు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో కుల పెద్దలు  దళిత సర్పంచ్ బాలామణి భర్త బండమీది మల్లయ్య అతని తమ్ముడు బండమీది సాయిలు ఇద్దరి కుటుంబాలని తీవ్ర వేధింపులకు గురిచేయడమే కాదు ఏకంగా బహిష్కరించారు. అవమానాలు భరించలేక తీవ్ర మనస్తాపంతో బొప్పాపూర్ సర్పంచ్ బాలమణి సిద్దిపేట పోలీసు కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తమ గోడు వినిపించారు. తమ కుల పెద్దలు తమ రెండు కుటుంబాలని మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలని సాంఘిక బహిష్కరణ చేశారని ఫిర్యాదు చేశారు. తమ ఇళ్లలో జరిగే కార్యాలకు,  శుభ కార్యాలకు ఎవరూ రావడం లేదని, గ్రామంలో కూడా  ఎవరూ తమను శుభ అశుభ కార్యాలకు పిలవకుండా అవమానిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పొలాల్లో వ్యవసాయ పనులకు ఎవరూ రావడం లేదని, ఎవరైనా ధిక్కరించి వెళితే ఆరు వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఒక సర్పంచ్ కుటుంబాన్నే ఇంత ఇబ్బంది పెడితే.. సామాన్య పౌరుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

For More News..

మద్యం తాగి కారుతో బీభత్సం.. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ పై కేసు

కోవిడ్ టీకా ధర రూ.250.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితం

క్లాస్ రూమ్‌లో లేడీ టీచర్ పై కత్తితో దాడి