
కాంగ్రెస్ పాలనతో ప్రజలు బాధపడుతున్నారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రంను కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని విమర్శించారు. ఎర్వవెల్లి కేసీఆర్ పార్టీ నేతలతో మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్‌ను తిరిగి గద్దె మీద కూర్చుండబెట్టే రోజు త్వరలో వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన రోజురోజుకు దిగజారుతోందన్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన... కాంగ్రెస్ నిచ్చెన మెట్లు ఎక్కడం మానివేసి... మొదటి దశలోనే మెట్లు దిగజార్చుకుంటూ నడుస్తోందని విమర్శించారు.కొన్నిసార్లు ఇలాంటి తమాషాలు జరుగుతుంటాయని... చరిత్రలోకి వెళ్తే అంతా అర్థమవుతుందన్నారు. పార్టీ బీ ఫామ్ ఇచ్చి అవకాశమిస్తే ఎవరైనా సిపాయిలుగా తయారవుతారన్నారు.కొంతమంది వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని అన్నారు.