సర్కార్ దవాఖాన్లలో గర్భిణులకు ఈవినింగ్‌‌ ఓపీ

సర్కార్ దవాఖాన్లలో గర్భిణులకు ఈవినింగ్‌‌ ఓపీ

అడ్వాన్స్‌‌డ్ ఓపీ బుకింగ్ సిస్టమ్

  •     వెయిటింగ్ ఇబ్బందులు లేకుండా చర్యలు
  •     ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఆరోగ్యశాఖ

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో సాయంత్రం కూడా గర్భిణులకు అవుట్ పేషెంట్ సేవలు అందించాలని ఆరోగ్యశాఖ భావిస్తోంది. అడ్వాన్స్ ఓపీ బుకింగ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’ కు తెలిపారు. ఈ ప్రతిపాదనలను సర్కార్ ఆమోదిస్తే గర్భిణులు గంటల తరబడి ఆస్పత్రుల్లో వేచి చూసే బాధ తప్పుతుందన్నారు. రాష్ట్రంలో ఏటా దాదాపు 4.5 లక్షల మంది గర్భిణులు ప్రభుత్వ దవాఖాన్లలో వైద్య సేవలు పొందుతున్నారు. మంత్లీ చెకప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం రోజూ ఒక్కో గైనకాలజిస్టు వద్దకు వందల సంఖ్యలో గర్భిణులు వస్తుండడంతో, 5 నిమిషాల కన్సల్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఐదారు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి.

డాక్టర్లు ఏవైనా స్కానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, టెస్టులు రాస్తే కూడా వెయిటింగ్ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంకా ఎక్కువ అవుతోంది. కొన్నిసార్లు మరుసటి రోజు మళ్లీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రావాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దీని వల్ల గర్భిణులు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గర్భిణులకు, వారి సహాయకులకు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సరిపడా కుర్చీలు ఏర్పాటు చేయడం, బాత్రూంల మెయింటెనెన్స్  కూడా కష్టంగా మారింది. గర్భిణులకు ఈ ఇబ్బందులు తప్పించేందుకే ఈవినింగ్ ఓపీ, టైమ్ అండ్ స్లాట్ బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వాన్స్ ఓపీ బుకింగ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉపయోగపడుతాయని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇందుకోసం ఓ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకురావాలని యోచిస్తున్నారు.

యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుకింగ్స్

గర్భిణుల్లో దాదాపు 80 నుంచి 90 శాతం మంది పదో తరగతి, అంతకంటే ఎక్కువ చదువుకున్న వారే ఉంటున్నారు. వీళ్లందరికీ స్మార్ట్ ఫోన్లు, యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వినియోగంపై అవగాహన ఉంటోంది. అడ్వాన్స్ ఓపీ బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్కానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుకింగ్ కోసం యాప్ తీసుకొస్తే దాన్ని ఉపయోగించడంలో గర్భిణులకు ఇబ్బంది ఉండదని అధికారులు చెప్తున్నారు. ఎవరికైనా యాప్ ఉపయోగించడం రాకపోతే, ఆశాలు, ఏఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంలు వారికి సాయం చేసేలా శిక్షణ ఇస్తామంటున్నారు. యాప్ బేస్డ్​ బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు, టోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి కూడా ఓపీ స్లాట్ బుక్ చేసుకునే సౌలత్​ను కూడా అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. తాము తీసుకురాబోతున్న కొత్త సిస్టమ్ కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుకింగ్ సేవలు కలిగి ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అధికారులు కోరినట్టు తెలిసింది. 

ఇబ్బంది లేకుండా చేస్తాం

‘హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెయిటింగ్ టైం ఎక్కువగా ఉండడం వల్ల గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. మా ప్రతిపాదనలకు సర్కార్ ఆమోదం తెలిపితే ఆ ఇబ్బంది లేకుండా చేస్తాం. హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పరిసర ప్రాంతాల్లో ఉన్న గర్భిణులు ఈవినింగ్ ఓపీ సేవలు వినియోగించుకునేలా, దూర ప్రాంత గర్భిణులు మార్నింగ్ ఓపీ సేవలు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తాం. అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ ఓపీ స్లాట్ బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దశలవారీగా అమలు చేస్తాం. ఎమర్జన్సీ కేసులకు ఎటువంటి బుకింగ్ అవసరం లేకుండా, డాక్టర్లు టైమ్ కేటాయించేలా చర్యలు తీసుకుంటాం.”అని ఉన్నతాధికారి ఒకరు వివరించారు.