మూడేళ్లలో బీసీలదే రాజ్యాధికారం : తీన్మార్ మల్లన్న

మూడేళ్లలో బీసీలదే రాజ్యాధికారం :  తీన్మార్ మల్లన్న
  • టీఆర్​పీ అధినేత తీన్మార్​ మల్లన్న

షాద్ నగర్:రిజర్వేషన్ల పేరుతో బీసీలను విడదీస్తూ మోసం చేస్తున్నారని  టీఆర్​పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. బుధవారం షాద్‌‌‌‌నగర్ పట్టణంలో జిల్లా యూత్​ విభాగం అధ్యక్షుడు శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ మహాసభలో ఆయన మాట్లాడారు. బీసీల చైతన్యమే భవిష్యత్తు రాజకీయ దిశను నిర్ణయిస్తుందన్నారు. రాబోయే మూడేళ్లలో తెలంగాణలో బీసీలదే రాజ్యాధికారమని ధీమా వ్యక్తం చేశారు. 

బీసీల హక్కుల టీఆర్​పీ పోరాడుతుందన్నారు. చరిత్రలో వివిధ పార్టీల జెండాలు మోశామని, ఇప్పుడు బీసీల జెండాలు మోస్తున్నామని అన్నారు. అగ్రవర్ణ కులాలు తమపై కుట్రలు చేస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అంతకుముందు పలువురు టీఆర్​పీలో చేరారు.