
- భూ నిర్వాసితులతో మాట్లాడిన కలెక్టర్
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని పద్మావతి సమేత శ్రీమహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు లైన్‌క్లియర్ అయ్యింది. ఆలయ విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులతో కలెక్టర్ప్రతీక్జైన్ కలెక్టరేట్లో బుధవారం సమావేశమయ్యారు.
సుమారు 8 వేల గజాల్లో భూసేకరణకు సంబంధించి ఇండ్లు కోల్పోతున్న కుటుంబాలతో మాట్లాడారు. భూమి విలువ, ఇండ్ల విలువను బట్టి నష్టపరిహారంతో పాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజ్చెల్లిస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, డీఆర్వో మంగీలాల్, కడా స్పెషల్ఆఫీసర్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.