
ది కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్తో సేన్ అస్వస్థత గురయ్యాడు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా కేరళ స్టోరీ ప్రమోషన్స్ కోసం ప్రముఖ ప్రదేశాలకు తిరుగుతున్న విషయం తెల్సిందే. దీంతో ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇక సుదీప్తో సేన్ కు వైద్య పరిక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
ఇక కేరళ స్టోరీ సినిమా విషయానికొస్తే.. ఇందులో అదా శర్మ, యోగితా బిలానీ, సోనియా, సిద్ది ఇధ్నాని ప్రధాన పాత్రల్లో నటించారు. కేరళ రాష్ట్రంలో దాదాపు 32 వేలమంది అమ్మాయిలను బలవంతంగా మతం మార్పించి.. వారిని తీవ్రవాదులుగా ఎలా మార్చారు అనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు సుదీప్తో సేన్. దీంతో ట్రైలర్ రిలీజైనప్పటి నుండి ఈసినిమా వివాదాలతోనే నడుస్తోంది.
సినిమాను బ్యాన్ చేయాలనీ తమిళనాడు ప్రభుత్వం ఎంతో ప్రయత్నించినా కుదరలేదు. అంతేకాదు సినిమాకు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు.. కలక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఇప్పటివరకు 200 కోట్లకుపైగా కలక్షన్స్ ను సాధించి ది కేరళ స్టోరీ రికార్డ్ ను బద్దలుకొట్టింది.