ట్రైలర్లో బూతులపై స్పందించిన డైరెక్టర్

ట్రైలర్లో బూతులపై స్పందించిన డైరెక్టర్

యాత్ర(Yatra) మూవీ ఫేమ్ మహి వి, రాఘవ్(Mahi V Raghav) డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ రా అండ్ బోల్డ్ వెబ్ సిరీస్ సైతాన్(Shaitan). రీసెంట్ గా ఈ సిరీస్ నుండి రిలీజైన  ట్రైలర్ సంచలనంగా మారింది. ట్రైలర్ నిండా బోల్డ్ కంటెంట్, బూతులు ఉందటంతో నెటిజన్స్ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా సినిమాపై వస్తున్న విమర్శలు, నెగిటీవ్ కామెంట్స్ పై స్పందించాడు దర్శకుడు మహి వి రాఘవ్. 

"నేను ఈసారి క్రైమ్‌ డ్రామా జానర్‌ ఎంచుకున్నాను. ఇందులో నలుగురు వ్యక్తులు వారు బ్రతకడం కోసం ఇతరులను చంపుకుంటూ పోతారు. ఇంతకుముందు నేనెప్పుడూ ఈ జానర్‌ టచ్‌ చేయలేదు. ఇందులో ఉన్న కంటెంట్‌ ప్రేక్షకులకు అర్థమవ్వాలంటే అందుకు తగ్గట్లు ఆ సన్నివేశాలు, బూతులు ఉండాల్సిందే! కథ డిమాండ్‌ చేసింది కాబట్టే వాటిని అలాగే ఉంచేశాం. అంతే తప్ప ప్రేక్షకులు నా సిరీస్‌ చూడాలని ఎంచుకున్న షార్ట్‌కట్‌ కాదు. ఒక రచయితగా, దర్శకుడిగా జనాలకు ఒక కథ చెప్పాలనుకున్నాను. సైతాన్‌ క్యాప్షన్‌ ఏంటో తెలుసా? 'మీరందరూ నేరం అనేదాన్ని వారు మనుగడ అని చెప్తున్నారు'. సమాజంలో వివక్షకు గురైన వారే నేరస్థులుగా మారతారు. ఈ పాయింట్‌ తీసుకునే సైతాన్‌ సిరీస్‌ తెరకెక్కించాను' అని చెప్పుకొచ్చాడు మహి వి రాఘవ్.

ఇక సైతాన్‌ సిరీస్‌ జూన్‌ 15 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌ స్టార్‌(HotStar)లో స్ట్రీమింగ్‌ కానుంది.ట్రైలర్ తోనే సంచలనం సృష్టించిన ఈ సిరీస్.. విడుదల తరువాత ఇంకెన్ని వివాదాలకు దారితీస్తుందో చూడాలి.