కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తం : మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు

కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తం : మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు
  •      కాంగ్రెస్ వచ్చాక లంచాలు లేకుండానే డిపెండెంట్ ఉద్యోగాలు 
  •      సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాల పెంపునకు కమిటీ వేస్తాం
  •      పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపించాలని ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూసీ శ్రేణులు, కార్మికులకు విజ్ఞప్తి 
  •      ఆయన గెలిస్తే పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కార్మికుల గొంతుకైతడని వెల్లడి

గోదావరిఖని, వెలుగు: సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చుతామని, ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రామగుండం నుంచే మొదలు పెడతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. అలాగే, సంస్థకు చెందిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని నివాసముంటున్న వారి స్థలాలను కూడా క్రమబద్ధీకరించనున్నామని తెలిపారు. ఆదివారం గోదావరిఖనిలో ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూసీ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ మహాసభతో పాటు పెద్దపల్లి పార్లమెంటరీ సన్నాహక సమావేశం నిర్వహించారు.

 ఈ కార్యక్రమానికి ముఖ్య​అతిథిగా హాజరైన శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పదేండ్ల పాలనలో సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు రావాలంటే రూ.లక్షలు లంచంగా ఇవ్వాల్సిందేనని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పూర్తి పారదర్శకంగా డిపెండెంట్ ఉద్యోగాలను కల్పిస్తున్నామన్నారు. సింగరేణి సంస్థలో 2023-–24 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 70 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిన కార్మికులు, సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్లు, ఆఫీసర్లకు శుభాకాంక్షలు తెలిపారు. 

సింగరేణి సంస్థ నష్టాలకు గురై బీఐఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్​ జాబితాలో చేరినప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కాకా వెంకటస్వామి ఎన్టీపీసీ సంస్థ ద్వారా రూ.450 కోట్ల రుణాన్ని ఇప్పించి ఆనాడు లక్షా 20 వేల మంది కార్మికుల ఉద్యోగాలను కాపాడారని గుర్తు చేశారు. అలాంటి కార్మిక పక్షపాతి కాకా కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణను ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూసీ శ్రేణులు, కార్మిక కుటుంబాలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.

 కార్మికుల సమస్యలపై అవగాహన ఉన్న వంశీకృష్ణ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వారి సమస్యల పరిష్కారానికి, కార్మిక సంక్షేమానికి కృషి చేస్తారని తెలిపారు. చదువుకున్న వ్యక్తిగా, పారిశ్రామిక వేత్తగా సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు కోసం, సంస్థ అభివృద్ధి కోసం పనిచేస్తారనన్నారు. ఇప్పటికే మోటర్ సైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తయారు చేసి సొంతంగా కంపెనీ పెట్టి 500 మందికి ఉపాధిని కల్పిస్తున్నారని తెలిపారు. ఎంపీగా గెలిచిన తర్వాత అందరికీ అందుబాటులో ఉండేలా పెద్దపల్లిలోనే నివాసం ఉంటారని తెలిపారు. 

కోటీ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చర్యలు..

సింగరేణిలో దురదృష్ణవశాత్తు ఎవరైనా కార్మికుడు మరణిస్తే ధర్నాలు చేస్తే గానీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేషియా చెల్లించని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు విమర్శించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.కోటి లైఫ్ ఇన్సూరెన్స్ వర్తింపచేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు. అలాగే కాంట్రాక్టు కార్మికులు మరణిస్తే రూ.25 లక్షలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాల పెంపు, వారి సంక్షేమం కోసం కమిటీని నియమించి, కార్యాచరణ రూపొందించి ఎన్నికలయ్యాక అమల్లోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

సింగరేణిలో కొత్త బొగ్గు గనులు రావాలని, ఎక్కడ గనులు ఏర్పాటు చేయవచ్చనే విషయంపై ఫీజిబులిటీ రిపోర్ట్ ఆధారంగా పనులు మొదలుపెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.  రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ పరిరక్షణకు, కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయాలని చేసిన కుట్రలను కార్మికుల బలంతో తిప్పికొట్టామన్నారు. సింగరేణి నష్టాల్లో ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాన్ని తీసుకొచ్చి సంస్థను కాకా వెంకటస్వామి కాపాడారని, వారి కుటుంబం నుంచి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మిక కుటుంబాలను ఆయన కోరారు. 

ఆదాయపు పన్ను మినహాయింపునకు కృషి చేస్తా: వంశీకృష్ణ

తనను ఎంపీగా గెలిపిస్తే సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తానని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తెలిపారు. పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న సింగరేణి సంస్థకు రావాల్సిన విద్యుత్ బకాయిలను కూడా తీసుకొచ్చేందుకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. గత పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పాలనలో సింగరేణి కార్మికులు అనేక ఇబ్బందులకు గురయ్యారని, ఆ పార్టీ లీడర్లు తెలంగాణ సంపదను దోచుకున్నారని ఆరోపించారు. కార్మికులు బాగుంటేనే సంస్థ బాగుంటుందని, సంస్థ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పారు.

 కార్మికుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తే బాధ్యతగా పనిచేస్తానని తెలిపారు. ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, ప్రేమ్ సాగర్ రావు, ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్, ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్, ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూసీ జాతీయ కార్యదర్శులు బాబర్ సలీం పాషా, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ చంద్రశేఖర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.నర్సింహరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులకు యూనియన్ తరఫున సత్కరించి మెమోంటోలను అందజేశారు.

రాహుల్ ప్రధాని అయితేనే ఐటీ మినహాయింపు: వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాహూల్ గాంధీ ప్రధాని అయితేనే సింగరేణి కార్మికులకు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్ ట్యాక్స్ మినహాయింపు జరుగుతుందని చెన్నూరు​ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సింగరేణిలో కొత్త బొగ్గు గనులు ఏర్పాటు కావాలని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు రావాలన్నారు. ఈ విషయమై సింగరేణి సీఎండీ బలరామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని గుర్తుచేశారు. జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో 1,100 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నెలకొల్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. జీవో 76 ద్వారా సింగరేణి ప్రాంతంలో ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని వివేక్ తెలిపారు.