ఓటరు నమోదుకు అప్లై చేసుకోండి

ఓటరు నమోదుకు అప్లై చేసుకోండి
  • పిలుపునిచ్చిన ఎన్నికల సంఘం
  • జనవరి ఫస్టు తుది గడువు

హైదరాబాద్‌‌, వెలుగు: ఓటరు లిస్టులో పేరు గల్లంతు అయిన వారు, 18 ఏళ్లు నిండిన అర్హులైన వారు వచ్చే ఏడాది జనవరి ఫస్టులోగా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల కమిషన్‌‌ పిలుపునిచ్చింది. ఇప్పటికే అప్లికేషన్ పెట్టుకున్న వారు అభ్యంతరాలు, కరెక్షన్స్‌‌ చేసుకోవచ్చని తెలిపింది. పాస్‌‌పోర్టు, డ్రైవింగ్‌‌లైసెన్స్‌‌, ఆధార్‌‌, రేషన్‌‌ కార్డు, బ్యాంక్‌‌ పాస్‌‌బుక్‌‌, ఫార్మర్స్‌‌ ఐడీ కార్డు తదితర కార్డులతోపాటు అథెంటికేషన్‌‌ కోసం డిజీలాకర్‌‌ డాక్యుమెంట్స్‌‌ కూడా అనుమతిస్తామని తెలిపింది. ఈ నెల 30 వరకు వెరిఫికేషన్‌‌ ప్రోగ్రాం నిర్వహిస్తామని, డిసెంబర్‌‌ 16న ఓటర్ల డ్రాఫ్ట్ సిద్ధం చేస్తామని ప్రకటించింది. డిసెంబర్‌‌ 12 నుంచి జనవరి 15 వరకు అభ్యంతరాల స్వీకరణ, జనవరి 27 వరకు అభ్యంతరాల పరిశీలన, ఫిబ్రవరి 7న ఫైనల్‌‌ పబ్లికేషన్‌‌ రిలీజ్ చేస్తామని తెలిపింది.

The Election Commission has called for voter registration by January first 2020