టెస్లా రాకతో రూపురేఖలు మారిపోనున్న.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌‌

టెస్లా రాకతో రూపురేఖలు మారిపోనున్న.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌‌
  • డెవలప్‌ కానున్న ఈవీ ఎకోస్టిస్టమ్‌
  • ఇండియాలో నెగ్గుకురావడం కంపెనీకి ఈజీ కాదు
  • ధరలు తగ్గిస్తేనే నిలబడుతుందన్న ఎనలిస్టులు

బిజినెస్‌‌ డెస్క్‌‌ వెలుగు: టెస్లా రాకతో ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎకోసిస్టమ్​ మార్కెట్‌‌ రూపురేఖలు మారిపోతాయని నిపుణులు అంచనావేస్తున్నారు. 2008 లో వచ్చిన యాపిల్‌‌ ఐఫోన్‌‌,  స్మార్ట్‌‌ ఫోన్ల కోసం ఓ కొత్త మార్కెట్‌‌ను క్రియేట్‌‌ చేయగలిగింది. అదేవిధంగా టెస్లా కూడా ఎలక్ట్రిక్‌‌ వెహికల్‌‌ మార్కెట్‌‌ను మారుస్తుందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్‌‌ కాంత్‌‌ అభిప్రాయపడ్డారు. టెస్లా రావడంతో ఎలక్ట్రిక్‌‌ వెహికల్‌‌ కాంపోనెంట్స్ తయారీ కంపెనీలు, సప్లయర్స్‌‌ కు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు.  కంపెనీ పూర్తిగా బిల్ట్ అయిన(కంప్లీటెడ్‌‌ బిల్ట్‌‌ యూనిట్‌‌–సీబీయూ) కార్లను ఇండియాకు తెస్తుందా? లేదా పార్టులను తెచ్చి ఇక్కడే అసెంబుల్‌‌(కంప్లీట్ నాక్‌‌ డౌన్‌‌–సీకేడీ) చేస్తుందా? అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. సీబీయూ యూనిట్లపై కస్టమ్స్ డ్యూటీ ఎక్కువగా ఉంటుంది. అయితే టెస్లా రాక వల్ల ఎకో సిస్టమ్​ డెవెలప్​ అయినప్పటికీ, లోకల్​ ఈవీ కంపెనీలకు పోటీ పెరుగుతుందని ఎనలిస్టులు అంటున్నారు. చిన్న ఈవీ కంపెనీలు నిలదొక్కుకోవడం కష్టమవుతుందని చెబుతున్నారు.

మోడల్‌‌ 3 తో ఎంట్రీ..

టెస్లా తన ఎంట్రీ లెవెల్ కార్‌‌‌‌  మోడల్‌‌3 తో ఇండియాలో అడుగుపెట్టనుంది.  దీని ధర రూ. 60–70 లక్షల మధ్య ఉంటుంది. ఈ మోడల్ మిడ్‌‌ సైజ్ లగ్జరీ సెగ్మెంట్‌‌లో మెర్సిడెజ్‌‌ ఈ, బీఎండబ్ల్యూ5 సిరీస్‌‌లతో పోటీ పడనుంది. సీకేడీ విధానంలో మోడల్‌‌–3 ను తెస్తారని ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు.  కాస్ట్​లీ టెస్లా కార్లు.. మోడల్‌‌ ఎస్‌‌ లేదా మోడల్‌‌ ఎక్స్ కార్లను మాత్రం సీబీయూ విధానంలో తేనుందని అన్నారు. వీటి ధర రూ. 1.5 కోట్లకు పైనే ఉంటుంది. ఇండియన్ మార్కెట్లోకి ఇంత రేటులో కార్లను తెస్తే కొందరు ధనవంతులు మాత్రమే కొంటారని ఎనలిస్టులు అంటున్నారు. కాస్ట్‌‌లీ కార్ల కోసం ఇండియాలో ప్లాంట్ అవసరం లేదని, చైనా నుంచి తెప్పిస్తే చాలని అంటున్నారు.  టెస్లా ఇండియా తన హెడ్‌‌ క్వార్టర్‌‌‌‌ను బెంగళూరులో ఏర్పాటు చేసింది. ప్లాంట్‌‌ను కూడా ఇక్కడే ఏర్పాటు చేసే చాన్సులు ఉన్నాయి.  ఏపీ లేదా గుజరాత్‌‌లలో కొన్ని చోట్లను కూడా పరిశీలిస్తోందని సమాచారం.

చైనా చాలా ముందుంది..

ఈవీ మార్కెట్లో చైనాతో పోల్చుకుంటే ఇండియా చాలా వెనకబడింది. ఈ సెగ్మెంట్లో హై ఎండ్ టెక్నాలజీని చైనా డెవలప్ చేయగలిగింది. రా మెటీరియల్స్‌‌, మాన్యుఫాక్చరింగ్‌‌, సెల్‌‌ కెపాసిటీ వంటివి ఈ దేశం కంట్రోల్‌‌లోనే ఉన్నాయి. కిందటేడాది చైనా 12.4 లక్షల ఎలక్ట్రిక్, హైబ్రిడ్​ వెహికల్స్‌‌ను సేల్ చేయగలిగింది. ఇండియా గతే ఆరేళ్లలో 8 వేల ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించగలిగింది.  దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్‌‌ 1 శాతం కంటే తక్కువగా ఉంది. ఇంకో పదేళ్లలో ఈ రేటును 30 శాతానికి పెంచాలని ప్రభుత్వ టార్గెట్‌‌గా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వెహికల్‌‌ తయారీ కంపెనీలకు ట్యాక్స్ రాయితీలను ప్రభుత్వం ప్రకటిస్తోంది.  ఫేమ్‌‌-–2 ప్లాన్‌‌ కోసం రూ. 10 వేల కోట్లను బడ్జెట్‌‌లో కేటాయించింది.

బెంగళూరులో టెస్లా ప్లాంట్‌

ఎలక్ట్రిక్‌ వెహికల్ కంపెనీ టెస్లా ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.  కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. కిందటి నెలలో బెంగళూరులో  టెస్లా  ఇండియా మోటార్స్‌ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌ పేరుతో కంపెనీ ఓ సబ్సిడరీని ఏర్పాటు చేసింది. రిజిస్టర్డ్ ఆఫీనునూ ఇక్కడే పెట్టింది.  ఈ సబ్సిడరీ పెయిడ్‌ అప్ క్యాపిటల్‌ రూ. లక్ష కాగా, అథరైజ్డ్ క్యాపిటల్‌ రూ. 15 లక్షలు. ఈ కంపెనీలో ముగ్గురు డైరక్టర్లుంటారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్​లో భూములపై పెట్టుబడి రూ.7 వేల కోట్లు

శేఖర్ కమ్ముల ‘నీ చిత్రం చూసి’ సాంగ్ రిలీజ్

25 మందిని కాపాడిన ఫోన్‌ కాల్‌: ధౌలిగంగ ఉప్పొంగుతోంది కొడుకా ఉరుకు

గ్రెటా థన్‌బర్గ్ ‘టూల్ కిట్’కు సాయం.. బెంగళూరు స్టూడెంట్‌ అరెస్ట్‌